- బాబర్ భాయ్… మేరే పురానే దోస్త్..!
- షాద్‌నగర్ లీడర్ బాబర్‌తో మంత్రి జూపల్లి పాత జ్ఞాపకాలు
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్, సీనియర్ నేత మహమ్మద్ అలీ ఖాన్ బాబర్‌ను చూసి “నమస్తే బాబర్ భాయ్… మేరే పురానే దోస్త్” (నా పాత స్నేహితుడు) అంటూ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తన హర్షాన్ని వ్యక్తం చేశారు.మంగళవారం షాద్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను కలుసుకునేందుకు వచ్చిన సందర్భంగా, మంత్రి జూపల్లిని కాంగ్రెస్ నేతలు, స్థానిక నాయకులు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంలో బాబర్‌ను కనిపెట్టి, వెంటనే ఆలింగనం చేసుకుంటూ “మీరే పురానే దోస్త్” అని చెప్పిన మంత్రి, గతంలో కాంగ్రెస్ పార్టీలో కలిసి పని చేసిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఎన్నో కార్యక్రమాల్లో సన్నిహితంగా ఉండే వారమని, ఆప్యాయతతో కలిసే వారమని ఎమ్మెల్యే శంకర్ తో పాటు ఇతర నేతలకు బాబర్ గురించి మధుర జ్ఞాపకాలు పంచుకున్నారు.తర్వాత బాబర్ ఖాన్, మంత్రి జూపల్లిని శాలువాతో సత్కరించి, సాదరంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ హృదయపూర్వక కలయిక అక్కడ ఉన్నవారిని ఆకట్టుకుంది.