పాల్కు షాక్.. సొంత గూటికి బాబు మోహన్!
నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ త్వరలో టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నిర్వహించిన ఫొటో సెషన్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబుమోహన్ చంద్రబాబుని కలిశారు. ఆయనతో భేటీ అయిన బాబు మోహన్ భావోద్వేగానికి గురయ్యారు.చంద్రబాబును కలవడంతో త్వరలోనే టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇటీవల కేఏ పాల్ పార్టీ ప్రజాశాంతిలో చేరిన బాబు మోహన్.. మళ్లీ సొంత గూటికి చేరబోతున్నట్లు సమాచారం. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రిగా పనిచేసిన బాబు మోషన్… ఆ తర్వాత టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మారుతూ వచ్చారు.