జీర్ణాశయంలో పుండ్లకు  ప్రధాన కారణం.. బ్యాక్టీరియా..

జీర్ణాశయంలో పుండ్లకు  ప్రధాన కారణం.. బ్యాక్టీరియా అని కనుగొన్న వైద్యుడు,

నోబెల్ గ్రహీత బారీ జేమ్స్ మార్షల్ పుట్టినరోజ.

IMG 20240930 WA0056

 1951  ఒక ఆస్ట్రేలియన్ వైద్యుడు. పెప్టిక్ అల్సర్లకు ప్రధాన కారణం సూక్ష్మ జీవులని కనుగొన్నందుకు ఆయన పాథాలజిస్టు జాన్ రాబిన్ వారెన్ తో కలిసి 2005 సంవత్సరానికి గాను ఫిజియాలజి / మెడిసిన్ లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. హెలికోబాక్టర్ పైలోరీ ( Helicobacter pylori ) అనే బాక్టీరియం చాలా వరకు పెప్టిక్ అల్సర్‌లకు కారణమని వీరిద్దరూ నిరూపించారు‌పెప్టిక్ అల్సర్లు అంటే జీర్ణాశయంలో, ఉత్తరాంత్రంలో ఏర్పడే పుండ్లు. ఇవి చాలా సాధారణమైన అనారోగ్య సమస్యలు. జీర్ణాశయ వాపు ( gastritis), జీర్ణాశయ పుండ్లు, ఉత్తరాంత్రంలో ఏర్పడే పుండ్లు హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వలన సంభవిస్తాయని రాబిన్ వారెన్, బారీ మార్షల్ లు కనుగొన్నారు.1982 లో ఈ బ్యాక్టీరియాను వారెన్, మార్షల్ కనుగొన్నారు. దీని గురించి తెలియక ముందు ఈ పుండ్లకు కారణం వత్తిడి, స్పైసీ ఫుడ్స్, వ్యక్తుల లైఫ్ స్టైల్ వలన కలిగే అధిక జీర్ణాశయ ఆమ్ల స్రావం అని అందరూ అనుకొనే వారు.1979 లో రాబిన్ వారెన్ తన వద్దకు వచ్చిన 50 శాతం రోగుల నుండి నుండి తీసిన బయాప్సీలలో వారి జీర్ణాశయ దిగువ భాగంలో వంపు తిరిగిన బ్యాక్టీరియాను కనుగొన్నారు. బారీ మార్షల్ 1981 లో వారెన్ తో జతకట్టారు. వారెన్ పరిశీలనపై ఆసక్తి చూపారు. ఆయన బ్యాక్టీరియాను విజయవంతంగా సంవర్ధనం ( cultivate ) చేశారు. 1983 లో వారి పరిశీలనను లాన్సెట్ పత్రికలో ప్రచురించారు. అయితే శాస్త్రీయ లోకం వారి ఫలితాలను అంతగా విశ్వసించలేదు. అందుకే మార్షల్ 1984 లో స్వయంగా హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా ఉన్న ద్రవాన్ని తాగి తనలో వ్యాధిని కలుగజేసుకొని యాంటీ బయాటిక్స్ తో చికిత్స చేసుకొన్నారు.  వీరిరువురూ కలిసి వందమంది రోగుల బయాప్సీలను పరిశీలించి పైన పేర్కొన్న జఠరాశయ సమస్యలు ఉన్న వారందరిలో ఈ బ్యాక్టీరియాను కనుగొన్నారు. ఈ ఫలితాల ఆధారంగా ఈ వ్యాధులకు కారణం హెలికోబాక్టర్ పైలోరీ అనే సూక్ష్మజీవి అని నిర్ధారణకు వచ్చారు.చాలా వరకు ఈ పెప్టిక్ అల్సర్లను ఆమ్లం ఉత్పత్తిని అదుపులో ఉంచి నియంత్రించినా మరలా మరలా వ్యాధి పునరావృతం కావడం వారు గమనించారు. అందుకే బ్యాక్టీరియాను నిర్మూలించడమే పరిష్కారం అనే నిర్ణయానికి వచ్చారు. అందుకోసం యాంటీ బయాటిక్స్ తో స్వల్ప కాలిక చికిత్స చేసి పుండ్ల సమస్యకు పరిష్కారం కనుగొన్నారు.వారెన్ అల్సర్ రోగులలో H. పైలోరీని గుర్తించడానికి సులభమైన రోగనిర్ధారణ పరీక్ష ( 14C-urea breath test) ను అభివృద్ధి చేయడంలో సహాయపడ్డారు.మార్షల్, అతని సహచరులు తమ పరిశోధనల్లో నెక్స్ట్-జనరేషన్ సీక్వెన్సింగ్ మరియు జెనోమిక్ అనాలిసిస్‌తో సహా కొత్త టెక్నాలజీలను చేపట్టారు. ఆయన 2017లో నాయిసీ గట్స్ ప్రాజెక్ట్‌ను స్థాపించారు. ఇది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కోసం కొత్త డయాగ్నస్టిక్స్ మరియు ట్రీట్‌మెంట్‌లను పరిశోధించడానికి ఉద్దేశించిన పరిశోధనా బృందం.

 

అవార్డులు:

లాస్కర్ అవార్డు (1995)

పాల్ ఎర్లిచ్ మరియు లుడ్విగ్ డార్మ్‌స్టెడ్టర్ ప్రైజ్ (1997)

బుకానన్ మెడల్ (1998)

FRS (1999) 

ప్రిన్స్ మహిడోల్ అవార్డు (2001)

కీయో మెడికల్ సైన్స్ ప్రైజ్ (2002)

ఫిజియాలజీలో నోబెల్ బహుమతి (2005)

వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ (2006)

Join WhatsApp

Join Now