Site icon PRASHNA AYUDHAM

బడే భాయ్ చోటే భాయ్…

IMG 20240724 WA1530

బిజెపి బడే భాయ్ కాంగ్రెస్ చోటేభాయ్ తీరు వలన గరీబ్ రాష్ట్రంగ తెలంగాణ

గజ్వేల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి

సిద్దిపేట జూలై 24 ( ప్రశ్న ఆయుధం ) :

కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్ర అనే పదం లేకుండా చూడడం హేయమైన చర్యగా సిగ్గుచేటు తెలంగాణ సమాజం తలదించుకునేలా ఉందని బిజెపి నరేంద్ర మోడీ సర్కార్ పై మండిపడ్డారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది మంది బిజెపి ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు కండ్లు లేని కబోదుల్లాగా, చెవులు లేని అవిటి వారిగా బడ్జెట్ను మౌనంగా వింటూ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ప్రశ్నించడం పోయి కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారుకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓట్లతో గెలిచి కనీసం పార్లమెంట్ ఎదుట ధర్నా చేయలేని సోమరులుగా తెలంగాణ ఎంపీలు మారారు అన్ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్ధ పరిపాలన వలన రోజురోజుకు తెలంగాణ రాష్ట్రం ఇవాళ తీస్తుందని వంటేరు ప్రతాపరెడ్డి మండి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్ప కూలింది అని అన్నారు. నిన్న పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 48 లక్షల కోట్ల 21 లక్షల బడ్జెట్ను ప్రవేశపెడితే అందులో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు గుండు సున్న గా ఇచ్చారని కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా నిధులను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం పై మరియు బిజెపి ఎంపీలను ప్రజలు అడుగడుగునా ప్రశ్నించాలని ప్రజలతో కోరారు. కేంద్రంలోని నరేంద్ర మోడీసర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి భారీ అన్యాయం జరిగింది అన్నారు. తెలంగాణ రాష్ట్రంపై మోడీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుంది అని విమర్శించారు. బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే చివరి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం పేరు తీయలేని దుర్మార్గపు ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ అన్నారు. మౌనంగా చూస్తూ చెవిటి వాళ్ళ లాగా నటించిన తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎంపీలు మరియు బీజేపీ ఎంపీలు అన్నారు. కనీసం పార్లమెంటు ఎదుట ధర్నా కూడా చేయలేని కాంగ్రెస్ బిజెపి చేతకాని దద్దమ్మ ఎంపీలు అన్నారు. కాంగ్రెస్ బిజెపి తీరు చూస్తా ఉంటే ఇక్కడ చోటే భాయ్ అక్కడ బడే భాయ్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడుగున అడ్డుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని చోటే భాయ్ తెలంగాణ రాష్ట్ర నిధులను హై కమాండ్ కి తరలిస్తా ఉంటే, కేంద్రంలోని బడే భాయ్ సంకీర్ణ ప్రభుత్వంలోని బీహార్ మరియు ఆంధ్ర రాష్ట్రాలకు నిధులను ప్యాకేజీలను వరదలాగా పారిస్తూ తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపారన్నారు. కాంగ్రెస్ బిజెపి ఇద్దరు ఒకటే అన్నారు. కనీసం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో త్రిబుల్ ఆర్ ప్రస్తావనే లేదు అన్నారు. కాలేశ్వరం కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ మహబూబ్నగర్ లాంటి ప్రాజెక్టులకు నిధులను మంజూరు చేయలేదు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఊసే లేదు అన్నారు. నిన్నటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రంగాలలో నిరాశే మిగిలింది అన్నారు. ములుగు గిరిజన యూనివర్సిటీకి నిధులు కేటాయించలేదు అన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంటు మరియు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే తీయలేదన్నారు. గత కెసిఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ధనిక రాష్ట్రంగా పిలువబడుతా ఉంటే గత కేసిఆర్ హయంలో తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడింది అన్నారు. కానీ నేడు బడే బాయ్ మరి చోటే భాయ్ తీరు వలన తెలంగాణ రాష్ట్రాన్ని గరీబ్ రాష్ట్రంగా తెలంగాణను తయారు చేశారు అని మండిపడ్డారు. కాంగ్రెస్ బిజెపి ఎంపీలు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఏమీ లాభం జరగలేదు ఆగ్రహం సబ్సిడీలకు రాయితీలకు బడ్జెట్ కోతలను విధించారు అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు బడ్జెట్లో గుండుతున్న నిధులు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించి కేసీఆర్ వెంటే ఉండాలని కోరారు. ఆనాడు ఇద్దరు ఎంపీలతో పార్లమెంటులో నిరసనలు ధర్నాలు చేసి కేసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసిఆర్ ది అన్నారు. కానీ నేడు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను ఢిల్లీలోని గులాములకు తాకట్టు పెడుతూ తెలంగాణ ఆస్తిత్వని లేకుండా చేయాలని చూడటమే లక్ష్యంగా కాంగ్రెస్ బిజెపి ల వ్యవహార శైలి ఉందని మండిపడ్డారు. రైతులకు ఇప్పటివరకు రైతుబంధు కాంగ్రెస్ ప్రభుత్వం 20 వేల కోట్ల వరకు పెండింగ్లో ఉందన్నారు. జూన్ నెలలో ఇవ్వవలసిన రైతుబంధు ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు రైతులు నార్మల్ వేసుకొని జూన్ నెలలో ఇవ్వవలసిన రైతుబంధు ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు రైతులు నార్మల్ జూన్ నెలలో ఇవ్వవలసిన రైతుబంధు ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు వరి నాట్లు వేసుకుని పెట్టుబడుల కోసం రైతుబంధు కోసం ఎదురుచూస్తున్నారు అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక న్యాయ పైసలు కూడా రైతు భరోసా కింద రైతుల ఖాతాలో జమ చేయలేదన్నారు కేవలం 6800 కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేసి చేతులను దులిపేసుకుందున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఆలోచించి కెసిఆర్ వెంటే ఉండాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్.సి రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జెడ్పిటిసి పంగమల్లేశం, గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, జగదేపూర్ మండలాధ్యక్షుడు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు అత్తిలి శ్రీనివాస్, గుంటుకు రాజు, కిషన్ రెడ్డి, సర్పంచులు దయాకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, హజ్జోస్ కమిటీ హజ్ హౌస్ కమిటీ మెంబర్ జాఫర్ ఖాన్, కిరణ్ గౌడ్, కొత్త కవితా శ్రీనివాస్ రెడ్డి, ఇక్బాల్, నర్సింగరావు, గొడుగు స్వామి, రఘుపతి రెడ్డి, అహ్మద్, పాల రమేష్ గౌడ్, ఆంజనేయులు, బింగి మల్లేశం, అబ్దుల్, రాజు తదితరులున్నారు.

Exit mobile version