బీసీ గురుకులలో బ్యాగ్ లాగ్ సీట్లకు ధరఖాస్తు

*బీసీ గురుకులలో బ్యాగ్ లాగ్ సీట్లకు ధరఖాస్తు*

చేవెళ్ల, మొహీనాబాద్, మార్చి 25,

మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల,రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా బీసీ గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న 6,7,8,9వ తరగతుల సీట్లను చేయడానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని,ఎంజేపీ గురుకుల పాఠశాల,ఎఫ్.ఏ.సీ ప్రిన్సిపాల్ జంగం నరేష్, ఒక ప్రకటనలో తెలిపారు.WWW.mjpbcwres. telangana.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు, చేసుకోవాలని ప్రిన్సిపాల్ జంగం నరేష్ సూచించారు. 6,7,8,9వ తరగతుల, ఇంగ్లీష్ మీడియంలో మొత్తం 6,832 బ్యాగ్ లాక్ ఉన్నాయని అర్హులైన విద్యార్థులు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష 20-04-2025 ( ఆదివారం ) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఏటిపి లింగ స్వామి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now