భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుకలు జరిపిన బహుజన సేన నాయకులు*
*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా నేటికీ భారతదేశంలోని ప్రతి ప్రాణిని రక్షిస్తున్నాడు*
*రాజ్యాంగాన్ని పాఠ్య పుసకాలలో చేర్చాలి..*
*బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జింక శ్రీధర్*
వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకల్లో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, రాజ్యాంగ బుక్క్ లను పంపిణీ చేసి రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జింక శ్రీధర్ మాట్లాడుతూ మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు రాజ్యాంగ కమిటీ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిరంతరం శ్రమించి భారతదేశంలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి హక్కులు కల్పిస్తూ సామాజిక సమానత్వం కల్పించిన భారత రాజ్యాంగాన్ని ప్రపంచ మేధావులు ప్రపంచంలో కెల్లా గొప్ప రాజ్యాంగంగా మన భారత రాజ్యాంగాన్ని ప్రశంసించడం దేశంలోని పాలను ప్రపంచమే గర్వించదగినదని అన్నారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను నేటితరం యువత తెలుసుకోవాలని కోరుకున్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాలలో చేర్చాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలని కోరుకున్నారు. నూకలమర్రి మాజీ ఎంపీటీసీ బొడ్డు రాములు మాట్లాడుతూ భారతదేశంలో మన ధర్మ శాస్త్రం సామాజిక సమానత్వం లేకుండా జీవిస్తున్న దేశ ప్రజలకు మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిరంతరం శ్రమించి రాజ్యాంగాన్ని రచించి విముక్తి పరిచారని. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, రాజ్యాంగ ద్వారానే మహిళలకు సమాన హక్కులు పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నూకలమర్రి మాజీ ఎంపీటీసీ బొడ్డు రాములు, శాతరాజుపల్లి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గుడిసె మనోజ్ కుమార్, బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి లక్కీ సాగర్, నేదూరి శ్రీకాంత్, నేదూరి రాజు, మల్లారం హరీష్,ఆరెల్లి రాజు, ఉల్లెందుల శ్రీను అలువాల రాము, పొత్తూరి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.