Site icon PRASHNA AYUDHAM

ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ కే సాధ్యం : బైరం రమేష్

WhatsApp Image 2025 01 23 at 6.46.29 PM

ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ కే సాధ్యం : బైరం రమేష్

గజ్వేల్ నియోజకవర్గం, 23 జనవరి 2025 : 

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంతరావుపల్లి లో గురువారం ప్రజాపాలన గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు బైరం రమేష్, మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం పాటుపడుతుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దశలవారీగా 6 గ్యారంటీలు అమలు చేస్తుందని, అందులో భాగంగా గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగిందని, అర్హులై ఉండి గతంలో దరఖాస్తు చేయని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, నిరుపేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయడం, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది అని, ఇది నిరంతర ప్రక్రియ అని, గత బిఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన దాఖలాలు లేవని, నిరుపేదలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ మీద ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలు మానుకోవాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో  గజ్వేల్ ఎమ్మార్వో శ్రావణ్, గ్రామ సెక్రటరీ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు దామనమైన మల్లేశం, దావుగారి ధార మల్లేశం,రామారావు దామనమైన నర్సింలు, బైరం సంగీత, గజ్వేల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కొప్పు రాజు, రవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దావు గారి కిషన్ యాదవ్, ప్రభాకర్ బైరం కరుణాకర్, తుమ్మ స్వామి, గోపాల్, బైరం రాజు, బైరం మహేష్, దాసరి రాజు, కరుణాకర్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version