*బిజెపి ఇల్లందకుంట మండల అధ్యక్షుడిగా బైరెడ్డి వెంకటరమణారెడ్డి*
*ఇల్లందకుంట జనవరి 11 ప్రశ్న ఆయుధం*
రాష్ట్ర పార్టీ కరీంనగర్ జిల్లాలోని వివిధ మండలాలకు నూతన మండల అధ్యక్షులను నియమించింది శనివారం రోజున బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి బిజెపి పార్టీ ఇల్లందకుంట మండల నూతన అధ్యక్షుడిగా బైరెడ్డి వెంకటరమణారెడ్డిని నియామక పత్రాన్ని అందజేశారు అనంతరం బిజెపి ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకంతో మండల అధ్యక్ష పదవి కల్పించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు వారు నాపై చూపించిన నమ్మకాన్ని వమ్ము చేయనని పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తానని తెలిపారు మండల అధ్యక్ష పదవికి అవకాశం కల్పించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి, బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణ రెడ్డికి, ఇల్లందకుంట మండలంలోని 29 బూత్ అద్యక్షులందరికీ, సినియర్ నాయకులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.బిజెపి పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రజా సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకపోతానని శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు
Post Views: 7