త్యాగం, ప్రేమ, సమానత్వానికి ప్రతీక బక్రీద్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

*త్యాగం, ప్రేమ, సమానత్వానికి ప్రతీక బక్రీద్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్*

ప్రశ్న ఆయుధం జూన్07: కూకట్‌పల్లి ప్రతినిధి

IMG 20250607 WA2318 scaled

నియోజకవర్గం 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ చౌరస్తా వద్ద ఉన్న ఈద్గా గ్రౌండ్లో ముస్లిం మైనార్టీ మరియు ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలకు ముఖ్యఅతిధిగా ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ తో కలిసి పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ త్యాగం, ప్రేమ, సమానత్వానికి ప్రతీక బక్రీద్ పండుగ అన్నారు. కులమతాలకు అతీతంగా డివిజన్ లోని ప్రజలందరూ అన్ని పండుగలు కలిసిమెలసి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Join WhatsApp

Join Now