*బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్పై ఫిర్యాదు*
టాలీవుడ్ హీరోలు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్లపై మారేడ్పల్లి పీఎస్లో రామారావు ఇమ్మనేని అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆహాలో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ సీజన్-2లో గోపిచంద్, ప్రభాస్.. Fun88 అనే చైనీస్ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని రామారావు పేర్కొన్నారు.