**బీజేపీ కీసర మండల అధ్యక్షుడిగా బాలరాజ్‌కు శుభాకాంక్షలు — చంద్రారెడ్డి సత్కారం**
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం మే 6
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కీసర మండల నూతన అధ్యక్షుడిగా బాలరాజ్ ఎన్నికైన సందర్భంగా, ఆయన మంగళవారం నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి బాలరాజ్‌ను శాలువాతో సత్కరించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ బలోపేతానికి బాలరాజ్ నాయకత్వం క్రియాశీలకంగా మారాలని కోరుతూ, మండలంలో బీజేపీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని చంద్రారెడ్డి సూచించారు. కొత్త నాయకత్వంతో కీసర మండలంలో బీజేపీ మరింత బలపడుతుందన్న విశ్వాసాన్ని పలువురు నాయకులు వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బాలరాజ్ మాట్లాడుతూ, పార్టీ ఎదుగుదలకు తన వంతు కృషి చేస్తానని, నాయకత్వం ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానని తెలిపారు. మండలంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి నాయకులందరి సహకారం కోరారు.ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.