Site icon PRASHNA AYUDHAM

సింగపూర్‌లో బాలయ్యబాబు 65వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించరు

Screenshot 2025 06 11 09 05 33 554 edit com.whatsapp

సింగపూర్‌లో బాలయ్యబాబు 65వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

నందమూరి తారక రామారావు  వారసుడిగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన నందమూరి బాలకృష్ణ  65వ పుట్టినరోజు వేడుకలు సింగపూర్‌లో తెలుగుదేశం ఫోరమ్ సింగపూర్ ఆధ్వర్యం లో ఘనం గా నిర్వహించారు . బాలయ్య అభిమానులు, సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలు పాల్గొని వేడుకలను పండగలా జరుపుకున్నారు .

సినీ రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా సూపర్ స్టార్‌గా ఉన్న బాలయ్యబాబు, తన శక్తివంచన లేకుండా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. ఆయన నటించిన లెజెండ్, సింహా, అఖండ వంటి చిత్రాలు తెలుగు సినీ చరిత్రలో గుర్తుండిపోయే చిత్రాలుగా నిలిచాయి,బసవ తారకం హాస్పిటల్ తో ఎంతో మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు సహాయ సహకారాలు అందించి,పునర్జన్మ ని ప్రసాదించాడు

సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ బాలయ్యబాబు తనదైన ముద్ర వేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున 2014 ,2019 మరియు 2024 ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఘన మెజారిటీ తో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజల సమస్యలపై తనదైన శైలిలో అసెంబ్లీ లో గళం విప్పిన బాలయ్య, తన ముక్కుసూటి వ్యాఖ్యలతో అందరి ప్రశంసలు అందుకున్నారు.

ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు పాల్గొని బాలయ్యబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version