అగ్ని ప్రమాదానికి గురైన ఇంటిని పరిశీలించి బాధితులను పరామర్శించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ .
ప్రశ్న ఆయుధం జనవరి04: బాల్కొండ మండల కేంద్రం నడిమిగల్లికి చెందిన పల్లికొండ చిన్ననర్సయ్య-లక్ష్మీ దంపతుల నివాస గృహం ప్రమాదవశాత్తు అనుకోవడంతో అగ్ని ప్రమాదానికి గురి పూర్తిగా కాలిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆ ఇంటిని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. వారి కుటుంబానికి (10000) పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఇందిరమ్మ ఇల్లు కేటాయించి వారి కుటుంబాన్ని ఆదుకుంటామని ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.