కూకట్ పల్లీ పార్ట్ – 2 (పాపిరెడ్డి నగర్) డివిజన్ బిజెపి అధ్యక్షునిగా ఎన్నికైన బాలు యాదవ్
ప్రశ్న ఆయుధం జనవరి 10: కూకట్‌పల్లి ప్రతినిధి
భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా కూకట్ పల్లీ పార్ట్ – 2 (పాపిరెడ్డి నగర్) డివిజన్ నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా నియమితులైన బాలు యాదవ్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. సంస్థగతంగా కింది స్థాయి నుంచి పార్టీ యొక్క పట్టిష్టతకు కృషిచేసి పార్టీని బలోపేతం చేయాలని పార్టీ మనపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎల్లవేళలా నిలబెట్టుకుని తగిన సమయాన్ని ఇచ్చి రానున్న రోజుల్లో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటుకు తీవ్రంగా కృషి చేయాలని మీకు అండగా పార్టీ ఉంటుందని వడ్డేపల్లి రాజేశ్వరరావు బాలు యాదవ్కు కొన్ని సూచనలు చేసి అభినందనలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పర్వతాలు యాదవ్, మాజీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, కార్యదర్శి రాజిరెడ్డి, మురళి,రాజు,రవి తదితరులు పాల్గొన్నారు.