సిద్దిపేట/గజ్వేల్, మార్చి 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు మంగళవారం నాడు కొండపోచమ్మ దేవాలయం వద్ద హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ రఘునందన్ రావులు రామకోటి రామరాజును శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. గత 25 సంవత్సరాల నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అమెరికా లాంటి ప్రాంతాలను లక్షలాది భక్తులచే 500కోట్ల లిఖిత సంఖ్యను దిగ్విజయంగా పూర్తి చేయించి 1000కోట్లకు శ్రీకారం చుట్టన సందర్బంగా సన్మానించారు. ప్రతి వ్యక్తిని భక్తి మార్గం చూపుతూ, ఎన్నో కష్టాలు అనుభవించి రామనామమే ప్రాణమని నమ్మిన రామకోటి రామరాజుకు రామభక్తి అమోఘమని గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమం తెలంగాణ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్, కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బింగి స్వామి పాల్గొన్నారు.