నాగారంలో గణపతి ఉత్సవాల సందడి – మండపాల వద్ద భక్తులతో కలిసిన బండారి మల్లేష్ యాదవ్
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 04
నాగారం మున్సిపాలిటీ పరిధి పండుగ హుషారుతో మార్మోగుతోంది. పలు కాలనీల్లో గణపతి మండపాలు భక్తుల సందడితో కిక్కిరిసిపోయాయి. ఈ ఆనంద క్షణాల్లో నాగారం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్ స్వయంగా భక్తులతో కలసి పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు.
మల్లేష్ యాదవ్ ప్రతి మండపంలో వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి, భక్తులను ఆశీర్వదిస్తూ – “గణపతి బప్పా మోరియా… ఈ పండుగ మనందరికీ ఐక్యత, స్నేహభావం, అభివృద్ధి తీసుకురావాలి” అని ఆకాంక్షించారు.స్థానిక యువత, మహిళలు, పెద్దలు అధిక సంఖ్యలో తరలి వచ్చి మల్లేష్ యాదవ్‌ను ఆత్మీయంగా ఆహ్వానించారు. ఆయన రాకతో ప్రతి మండపం హర్షధ్వనులతో మార్మోగింది. పూలు, మంత్రాలు, సంగీతం కలసి మొత్తం నాగారం నిన్న రాత్రి పండుగ వాతావరణంలో తేలిపోయింది.