*ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యా సంస్థల బంద్*
*ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించాలి*
*అఖిలభారత విద్యార్థి సమైక్య తెలంగాణ శాఖ పిలుపు*
*సిద్దిపేట జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు రామగళ్ళ నరేష్*
చేర్యాల : తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులకు అదేవిధంగా మరణించిన విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు రామగళ్ళ నరేష్ అన్నారు అఖిలభారత విద్యార్థి సమైక్య తెలంగాణ శాఖ పిలుపులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల బంద్ నిర్వహించామని అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన భోజనం లేకపోవడం మరియు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కలుషిత ఆహారాన్ని తినడం వల్ల అనేక మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురై పదుల సంఖ్యలో విద్యార్థులు మరణించిన ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఆయన విమర్శించారు