సమగ్ర కుటుంబ సర్వే పై నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించిన బండి రమేష్ 

సమగ్ర కుటుంబ సర్వే పై నియోజకవర్గ కార్యకర్తలతో

చర్చించిన బండి రమేష్

 

ప్రశ్న ఆయుధం నవంబర్ 16: కూకట్‌పల్లి ప్రతినిధి

 

కూకట్పల్లి నియోజకవర్గం లో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే పై నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ శనివారం పార్టీ నాయకులతోను ఆటు అధికారులతోనూ చర్చించారు. ముందుగా బాలానగర్లోని పార్టీ కార్యాలయంలో బ్లాక్ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు మహిళా అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ నాయకులతో సమగ్ర సర్వేపై విపులంగా చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం కావడంతో సమగ్రసర్వే విజయవంతం కావడానికి పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలను ఆయన నాయకులకు కార్యకర్తలకు వివరించారు సర్వేను విజయవంతం చేయడానికి అవసరమైన సందర్భంలో పార్టీ కార్యకర్తలు అధికారులకు సహకరించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు మేరకు గడువు లోపల అధికారులు పూర్తిచేసేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం కులగణన పై సర్వే నిర్వహిస్తున్న అధికారులతో బాలానగర్లోని వార్డు కార్యాలయంలో రమేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు సర్వే కోసం ఇంటింటికి వెళ్ళినప్పుడు అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలపై అక్కడ పడుతున్న సమయం, ప్రజల నుంచి ఎలాంటి సహకారం అందుతుంది అన్నదానిపై అధికారులతో రమేష్ చర్చించారు. ప్రజల నుంచి సరైన స్పందన ఉంటుందా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు సమగ్ర సర్వేపై ప్రజల్లో అవగాహన కోసం ఏమైనా చర్యలు తీసుకోవాల్సి ఉందా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now