మండలి చీఫ్ విప్ గా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన
బండి రమేష్ మరియు శేరి సతీష్ రెడ్డి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 09: కూకట్‌పల్లి ప్రతినిధి
మండలి చీఫ్ విప్ గా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్ రెడ్డి ని బుధవారం కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ అసెంబ్లీ ఆవరణలో కలిసి పుష్ప గుచ్చం అందజేసి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో మహేందర్ రెడ్డి పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని కార్యకర్తలకు, నాయకులకు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. నాయకులు శేరి సతీష్ రెడ్డి , ప్రవీణ్ , అరవింద్ రెడ్డి , ఫణి కుమార్ , మణి తదితరులు పాల్గొన్నారు.