న్యూఢిల్లీలో బండి సంజయ్‌ దీపావళి సంబురాలు

న్యూఢిల్లీలో బండి సంజయ్‌ దీపావళి సంబురాలు

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ న్యూఢిల్లీలోని తన నివాసంలో దీపావళిని ఆహ్లాదంగా జరుపుకున్నారు.

వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బందితో కలిసి టపాసులు కాల్చి ఆనందం పంచుకున్నారు.

సిబ్బందికి స్వయంగా స్వీట్లు అందజేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

“దీపావళి వెలుగులు ప్రతి ఇంటికి సంతోషం తీసుకురావాలి” అంటూ బండి సందేశం ఇచ్చారు.

పండుగ వాతావరణంలో మంత్రి నివాసం వెలుగులతో ముస్తాబైంది.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన న్యూఢిల్లీ నివాసంలో దీపావళి వేడుకలను కుటుంబసభ్యులు, సిబ్బంది, భద్రతా సిబ్బందితో కలిసి ఘనంగా నిర్వహించారు. రాత్రి వేళ టపాసులు కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ స్వీట్లు పంచి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

దీపాల వెలుగులు దేశం నిండా సంతోషం, శాంతి, సుభిక్షం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. బండి నివాసం ఈ సందర్భంగా విద్యుత్ దీపాలతో కాంతులీనగా కనిపించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment