ముఖ్యఅతిథిగా బండి సంజయ్…!!

సభ్యత నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న

ముఖ్యఅతిథిగా బండి సంజయ్,

సామ రంగారెడ్డి, రవి కుమార్ యాదవ్, ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి

 

ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 11: శేరి లింగంపల్లి ప్రతినిధి

 

గచ్చిబౌలి డివిజన్ గౌలిదొడ్డిలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సంస్థాగతం సభ్యత నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమము సామ రంగారెడ్డి అధ్యక్షతన నిర్వహించగా , ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి , నియోజకవర్గ ఇన్చార్జి రవికుమార్ యాదవ్ , కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు రవీందర్రావు, నరేష్ ,రాఘవేంద్రరావు ,మణిభూషణ్ , మహిపాల్ రెడ్డి , అశోక్ కురుమ , నరేందర్ రెడ్డి , నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు , కంటెస్టెంట్ కార్పోరేటర్స్ , మహిళా మోర్చా నాయకురాలులు హాజరయ్యారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ,బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసిన పోటీ చేసిన బిజెపిని ఓడించడం అసాధ్యమని బండి సంజయ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే బిజెపికి అత్యంత సభ్యులు ఉన్నారని తాజాగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి కార్యకర్త కష్టపడి మరింత మందిని సభ్యులుగా చేర్చాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ , బిఆర్ఎస్ పార్టీ ఒకటేనని విమర్శించారు , కాంగ్రెస్ పార్టీని 6 గ్యారెంటీలను నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని .కానీ ఒక్క గ్యారంటీకి కూడా వారంటీ లేదన్నారు. రుణమాఫీ, బోనస్, రైతు భరోసా, మహిళలకు 4 వేలు, తులం బంగారం ,నిరుద్యోగ భృతి ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు ,6 గ్యారెంటీల నుండి ప్రజల దృష్టిని మార్చేందుకు హైడ్రా అని హైడ్రామా ఆడుతున్నారని విమర్శించారు. చిన్నా చితక వారి మీద హైడ్రా పతాపం చూపుతుందని ,ముందు అలాంటి వాటికి అనుమతులు ఇచ్చిన వారి మీద కేసులు పెట్టాలని ,పేదల మీద ప్రతాపం చూపెడుతున్న హైడ్రాకు వ్యతిరేకమని అన్నారు, హైడ్రా కాదు ముందు 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు,

కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బిజెపికి తప్ప ఏ పార్టీకి సిద్ధాంతాలు లేవని నేషన్ ఫస్ట్, మనం సెకండ్ అనేది బిజెపి నినాదమని బిజెపి గెలవడం మనకంటే దేశానికి ఎక్కువ ముఖ్యమనారు. మొత్తం ప్రపంచం కన్ను ఇప్పుడు భారత్ మీద ఉందని, మోడీ నాయకత్వంలో అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని చైనా, అమెరికాలు భారత్ ఎదగవద్దని

చుస్తుందన్నారు.

దేశంలో ఎక్కువమంది సభ్యులు ఉన్న పార్టీ బిజెపి అని రానున్న అన్ని ఎన్నికల్లో అందరూ కలిసి నడవాలని కొత్త సభ్యులను పార్టీలో చేర్పించాలి .అలాగే ఎక్కువ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని సామారంగారెడ్డి కోరారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో బిజెపి పార్టీకి ఎదురులేదని, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీయే ప్రత్యామ్నాయమని తెలుపుతూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక యజ్ఞం లాగా చేపట్టి రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి శేరిలింగంపల్లి నియోజక వర్గాన్ని భారతదేశ చరిత్రలో నిలిచేటట్టుగా కష్టపడి పని చేస్తామని పార్టీ పెద్దలకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి నియోజకవర్గం లోని రాష్ట్ర, జిల్లా ,డివిజన్ అధ్యక్షులు, కంటెస్టెంట్ కార్పొరేటర్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మహిళా మోర్చా, యువ మోర్చా, ఎస్సీ ,ఎస్టీ మోర్చా, కిసాన్ మోర్చా మొదలగు వారు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now