Site icon PRASHNA AYUDHAM

జవ్వాడ ఫాంహౌజ్ ‘రేవ్ పార్టీ’ కేసును నీరుగార్చే కుట్ర మొదలైంది:బండి సంజయ.

జవ్వాడ ఫాంహౌజ్ ‘రేవ్ పార్టీ’ కేసును నీరుగార్చే కుట్ర మొదలైంది:బండి సంజయ.

ట్విట్టర్ టిల్లు కేటీఆర్ బామ్మర్ది,జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీలో ట్విట్టర్ టిల్లు కుటుంబ సభ్యులతో పాటు , ఆయనకు దగ్గరి స్నేహితులు ఉన్నట్లుగా ముఖ్యంగా డ్రగ్స్ సప్లయ్ చేసేటువంటి ప్రధాన వ్యక్తులు అందరూ ఉన్నట్లు సమాచారం ఉందని బండి సంజయ్ అన్నారు. పార్టీలో పాల్గొన్న వారు పలుకుబడి కలిగిన వ్యక్తులుగా తెలుస్తోంది.. వారి నుంచి పాస్ పోర్టులను స్వాధీనం చేసుకోవాలి. ప్రతి సీసీటీవీ పుటేజీలను విడుదల చేయాలి. ఎలాంటి ఉదాసీనత లేకుండా.. తప్పించుకునే మార్గాలు లేకుండా తక్షణమే అరెస్టులు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.తెలంగాణ పోలీస్ వ్యవస్థపై పక్కా నమ్మకం ఉంది.. కానీ, గతంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఉన్న దోస్తానా కారణంగా కొంతమంది పోలీసు అధికారులు కుటుంబ సభ్యులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దానితోపాటు కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది నాయకులు కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల కారణంగా పోలీసు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పై మాకు నమ్మకం లేదు.. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే హోంశాఖ ఉంది. ఆయనే స్వయంగా ఈ కేసుపై దృష్టిసారించాలని బండి సంజయ్ కోరారు..

Exit mobile version