పలు ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న బండి రమేష్  

పలు ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న బండి రమేష్

ప్రశ్న ఆయుధం జూన్08: కూకట్‌పల్లి ప్రతినిధి

కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ఆదివారం నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మోతీ నగర్ పాండురంగ నగర్లో వేం చేసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి 31వ వార్షిక బ్రహ్మోత్సవాలు రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రశాంత్ నగర్ లో రేణుక ఎల్లమ్మ మరియు పోచమ్మ యంత్ర విగ్రహ ప్రతిష్ట నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం లో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు భక్తులకు అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కే నరేష్, నాయకులు లక్ష్మయ్య, సుధాకర్ , సాత్విక్ ,శివ చౌదరి, గోవిందు ,రమణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment