గణనాయకుని పల్లకిలో బండి సంజయ్
ట్రాక్టర్ ఎక్కి నడిపిన కేంద్ర మంత్రి – కరీంనగర్‌లో నిమజ్జనోత్సవం జోష్
ప్రశ్న ఆయుధం కరీంనగర్, సెప్టెంబర్ 5:
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గణనాయకుడి సేవలో ప్రత్యేక పాత్ర పోషించారు. మహాశక్తి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, గణనాయక విగ్రహాన్ని స్వయంగా ట్రాక్టర్‌లో ప్రతిష్ఠించారు.
ఆ తరువాత బండి సంజయ్ స్వయంగా ట్రాక్టర్ స్టీరింగ్ ఎక్కి భక్తులతో కలిసి ఊరేగింపుగా కొద్ది దూరం నడిపారు. ఆలయ ప్రాంగణం నుండి వీధుల గుండా గణనాయకుడి నినాదాలతో గంభీర వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉండగా, కరీంనగర్ నగరంలో గణేశ్ నిమజ్జనోత్సవం ఘనంగా ప్రారంభమైంది. సాయంత్రం టవర్ సర్కిల్ వద్దకు బండి సంజయ్ విచ్చేయనున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు వివిధ మండపాల్లో జరిగే నిమజ్జనోత్సవాల్లో పాల్గొని భక్తులతో కలిసి శోభాయాత్రల్లో భాగమవుతారని సమాచారం.
గణనాయకుని భక్తి – జనానందం – రాజకీయ నాయకత్వం సమ్మిళితమైన ఈ దృశ్యం కరీంనగర్ ప్రజలకు విశేష ఆకర్షణగా మారింది.