Site icon PRASHNA AYUDHAM

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఆపాలి

దాడులు
Headlines
  1. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఆపాలని అయ్యప్ప సేవాసమితి డిమాండ్
  2. అయ్యప్ప సేవాసమితి సభ్యులు సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేత
  3. బంగ్లాదేశ్ లో హిందూ ఐక్యత అవసరం: అయ్యప్ప సేవాసమితి పోరాటం
  4. ఇస్కాన్ ప్రతినిధుల అరెస్ట్ పై అయ్యప్ప సేవాసమితి తీవ్ర అభ్యంతరం
  5. హిందువులపై దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్న అయ్యప్ప సేవాసమితి

*సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేత*

ప్రశ్న ఆయుధం 02 డిసెంబర్(బాన్సువాడ ప్రతినిధి)

బంగ్లాదేశ్ లో హిందువులపై ఆగడాలు ఆపాలని అరెస్టు చేసిన ఇస్కాన్ ప్రతినిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్ కిరణ్మయి వినతిపత్రం సమర్పించడం జరిగింది.అయ్యప్ప ఆలయం నుంచి బైకుల మీద ర్యాలీగా వెళ్లిన సేవా సమితి సభ్యులు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు హిందువుల ఐక్యతగా ఉండాలని నినాదాలు చేశారు. అనంతరం సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ…శాంతిని కోరుకునే హిందువులపై దాడులను క్షమించరాని నేరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్ పై ఒత్తిడి పెంచాలని అన్నారు. బంగ్లాదేశ్ విపత్తులో ఉన్నప్పుడు ఇస్కాన్ ప్రతినిధులు అక్కడ ఎన్నో సేవలు చేశారని,వారికి అన్న ప్రసాదం కూడా అందించారని అన్నం పెట్టిన వారిని అరెస్టు చేయడం శోచనీయమని అన్నారు. హిందువులు ఐక్యంగానే ఉంటేనే మనగడ కొనసాగిస్తామని లేనిచో ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు.ప్రభుత్వాలు ఈ అంశంపై స్పందించకపోతే అన్ని ప్రాంతాలలో ఉద్యమాలు బయలుదేరుతాయని వారు హెచ్చరించారు.రోజురోజుకు బంగ్లాదేశ్ లో హిందువుల మనగడ కష్టమవుతుందని వారి ఆవేదన వ్యక్తం చేశారు.భారతదేశంలో మైనార్టీలకు హక్కులు ఇచ్చినట్లుగా బంగ్లాదేశ్ లో కూడా ఇవ్వాలని వారన్నారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి ప్రతినిధులు కొనాల గంగారెడ్డి ధనగారి కృష్ణారెడ్డి,మల్లికార్జున్, వీరప్ప,సిద్ది మహేష్,శంకర్ గౌడ్ , అరుణ్,దేవకిసురేష్,అరవింద్, మాణిక్యం గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version