బంజారా భవనంలో బంజారా హ్యాండ్ క్రాఫ్ట్ మేళ 

బంజారా
Headline :
ఖమ్మం బంజారా భవనంలో హ్యాండ్ క్రాఫ్ట్ మేళ – సాంప్రదాయ వస్త్రాలు మరియు ఆభరణాల ప్రదర్శన

ఖమ్మం నగరం బంజారా భవనం లో దేవరకొండ ప్రాంతానికి చెందిన నేనావత్ శ్రీనివాస్ (యడీ) ఆధ్వర్యంలో నిర్వహించిన బంజారా హ్యాండ్ క్రాఫ్ట్ మేళా ను ఖమ్మం జిల్లా బంజారా పెద్దలు సందర్శించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతరించిపోతున్న బంజారా సాంస్కృతి సాంప్రదాయాలు కాపాడే విధంగా బంజారా లు ధరించే వస్త్రాలను ఎటువంటి యంత్రల సహాయం అలాగే మిషన్ కుట్టు లేకుండా బంజారా ఆడబిడ్డలు స్వయంగా వారి చేతులతో తయారు చేసిన పనిముట్లను ఆతరం నుండి ఈతరం వరకు ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకురావడం అభినందించ తగిన విషయం అన్నారు . టుక్రియ , బలియా , బురియ , వారికిడి , బోదులు టోపీలి , హస్లిం , ఒంగిడి వరకు అలాగే మగవారికి తలపాక పట్టెడు అరిసికోహరి , బ్యాగులు , ఇంటి తోరణాలు , బంజారా పిల్లల గాజులు మరి కమ్మలు , చెవి దిద్దులు , చిన్నపిల్లల బట్టలు వంటి నిత్యవసర పరికరాలను అందుబాటులోకి తీసుకు రావడం బంజారా సోదరి సోదరీమణులు గౌరవించదగిన విషయమని అన్నారు . కావున మన బంజారా బిడ్డను ఆదరించి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు . ఈ కార్యక్రమంలో జిల్లా బంజారా నాయకులు బానోత్ కిషన్ నాయక్ , బిక్షపతి రాథోడ్ , హెచ్ బి నాయక్ , డిఈ వెంకట్రామ్ నాయక్ , శివాలాల్ నాయక్ , ధరావత్ రామ్మూర్తి నాయక్ , ఏఓఈ రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు .

Join WhatsApp

Join Now