బ్యానర్లు పోస్టర్లు అంటించరాదు: మున్సిపల్ కమిషనర్ అమ్రపాలి

జిహెచ్ఎంసి పరిధిలో ఎలాంటి బ్యానర్లు పోస్టర్లు అంటించరాదు: మున్సిపల్ కమిషనర్ అమ్రపాలి 

IMG 20240928 WA0030

గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోడలపై వాల్ పోస్టర్లు అంటించరాదని ఈ మేరకు జిహెచ్ఎంసి కమి షనర్ ఆమ్రపాలి సర్క్యూలర్ జారీ చేశారు  వాల్ పోస్టర్లతో పాటు వాల్ పెయింటింగ్స్‌పై కూడా సీరియస్‌గా వ్యవహరించా లని.ఈ క్రమంలోనే.. సినిమా థియేటర్ వాళ్లు కూడా ఎక్కడా గోడలకు పోస్టర్లు అతికించకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్లకు ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. గోడలపై పోస్టర్లు అంటిస్తే జరిమానా విధించాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వు లను సీరియస్‌గా అమలు చేయాలని అధికారులకు ఆమ్రపాలి సూచించారు. అయితే.. నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అయితే.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఉత్తర్వుల్లో కమిషనర్ ఆమ్రపాలి పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now