*ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలి*
*డయల్ 100 కాల్స్ పై తక్షణమే స్పందించాలి*
*తమ గ్రామాలలో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి*
*విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ తమకు కేటాయించిన గ్రామాలలో విధిగా పర్యటించాలి*
వార్షిక తనిఖీల్లో భాగంగా చిలిపి చేడ్ పోలీస్ స్టేషన్ తనిఖీ*
*జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐపిఎస్
మెదక్ జిల్లా ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐపిఎస్ సూచించారు. శుక్రవారం వార్షిక తనిఖీ లో భాగంగా చిలిపి చేడ్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐపిఎస్.మాట్లాడుతూ శాంతి భద్రతలు కాపాడటంలో బ్లూ కోట్స్ సిబ్బంది ముందుండి డయల్ 100 కాల్స్ పై తక్షణమే స్పందించాలని సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంలో బ్లూ కోట్స్ సిబ్బంది తక్షణమే స్పందించి బాధితలకు న్యాయం చేయాలనిఅలాగే సిసి కెమెరాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ అన్ని గ్రామాల మరియు పట్టణ ప్రజలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి తమ గ్రామాలలో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
సిబ్బంది తో మాట్లాడుతూ… పోలీస్ స్టేషన్ అంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయు తంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి, చిలిపి చేడ్ ఎస్.ఐ. నర్సింలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.