ఘనంగా మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ జన్మదిన వేడుకలు
ముధోల్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ బోస్లీ నారాయణరావు పటేల్ 66వ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ 66వ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని మాజీ సర్పంచ్ మండల అధ్యక్షుడు మమ్మాయి రమేష్, బీసీ సెల్ అధ్యక్షుడు జంగం రమేష్, టౌన్ అధ్యక్షుడు రాజేశ్వరి దేశముక్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బలగం దేవేందర్, కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం నిరుపేదలకు, యాచకులకు పండ్లు పంపిణీ చేశారు.