గోదావరికి వరద పోటెత్తడంతో బాసర జలదిగ్బంధం లో చిక్కుకుంది.
(ప్రశ్న ఆయుధం ఆగస్టు 30)
నిజామాబాద్:వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ గోదావరికి వరద పోటెత్తడంతో బాసర జలదిగ్బంధం లో చిక్కింది. మూడు వైపులనుంచి వరద నీరు చుట్టేయడం తో యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్డిఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి గత రాత్రి నుంచి సహాయక చర్యలను ముమ్మరం చేసాయి. ఆయా కాటేజీలో ఉన్న భక్తులను షెల్టర్ లకు తరలిస్తున్నారు. మరో వైవు బాసర వంతెన దాక గోదావరి ప్రవాహం వుండడంతో రైల్వే అధికారులు నాందేడ్ వైపు వెళ్లే పలు రైళ్లను రద్దు చేసారు. ఎగువ గోదావరి నుంచి భారీగా వరద రావడంతో పాటు నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్లే బాసర వద్ద నీటి ప్రవాహం అనూహ్యంగా పెరిగింది. ఈపాటికే కందుకుర్తి వద్ద వంతెన మీదుగా గోదావరి ప్రవాహం అవుతుండడంతో మహారాష్ట్ర వైపు రాకపోకలను నిలిపి వేశారు. ప్రస్తుతం వర్షాలు లేక పోయినప్పటికి గోదావరికి వరద పోటు అంతకంతకు పెరగడంతో పాటు పోచంపాడ్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కూడా తోడైంది అందుకే బాసర జ్ఞాన సరస్వతి అమ్మ వారి మందిరం కు వెళ్లే మూడువైపులా వరద నీరు చుట్టేసింది. ఆలయ వేద పండితులు గోదావరి శాంతించేలా ప్రత్యేక పూజలు సైతం నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం ఒక రోజు ముందే బాసర క్షేత్రానికి వచ్చిన భక్తులు ఆలయ సమీపంలోని ఆయా సత్రాలు గెస్ట్ హౌస్ లు కాటేజీ ల్లో ఉన్నారు. అన్ని వైపుల వరద నీరు చుట్టేయడంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. ఎన్డిఎఫ్ బలగాలు రంగంలోకి దిగి ఆయా హోటళ్లు గెస్ట్ హౌస్ ల్లో ఉన్న వారిని బోట్ల మీద సురక్షిత ప్రాంతాలకు తరలించారు.