సంగారెడ్డి/అల్లాదుర్గం, ఆగస్టు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో ఆదివారం విశ్వగురు మహాత్మా బసవేశ్వర విగ్రహావిష్కరణ వీరశైవ లింగయత్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఉత్సవంలో రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల మల్లికార్జున పాటిల్, ఉపాధ్యక్షులు రాజేశ్వర స్వామి, గౌరప్ప, కార్యదర్శి జగదీశ్వర్, నాయకులు అశోక్ బాబు, ముస్లాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు బారాధి రాజు, ప్రధాన కార్యదర్శి మహేష్, ఉపాధ్యక్షుడు నాగరాజు, సభ్యులు ఈశ్వరప్ప, విశ్వేశ్వర్, రాజు, బసంత్, బసవరాజ్ స్వామి, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ముస్లాపూర్ లో బసవేశ్వర విగ్రహావిష్కరణ
Oplus_131072