ఈ నెల 23న జహీరాబాద్‌లో సీఎం చేతుల మీదుగా బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ: రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఉపాధ్యక్షుడు రాజేశ్వర్ స్వామి

సంగారెడ్డి ప్రతినిధి, మే 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఈ నెల 23న శ్రీ మహాత్మ గురు బసవేశ్వర విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారని రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఉపాధ్యక్షుడు, బీసీ సంక్షేమ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ స్వామి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. బసవ తత్త్వాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం హర్షణీయమని పేర్కొన్నారు. గురు బసవేశ్వర జీవితం, సార్వత్రిక మానవతా విలువలను చాటే ఈ విగ్రహం, సమాజానికి ప్రేరణనిచ్చేలా ఉండబోతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని బసవ భక్తులు, లింగాయత్ సమాజం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రాజేశ్వర్ స్వామి కోరారు.

Join WhatsApp

Join Now