ప్రాథమిక పరీక్షలు జీవితానికి రక్షణ ఇస్తాయి – కంసాల శ్రీనివాస్ కార్పోరేటర్

*ప్రాథమిక పరీక్షలు జీవితానికి రక్షణ ఇస్తాయి*

– *కంసాల శ్రీనివాస్ కార్పోరేటర్*-

కరీంనగర్  డిసెంబర్ 31;

కరీంనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ హుస్సేన్పుర ఆధ్వర్యంలో ఈరోజు కిసాన్ నగర్ మూడో డివిజన్ లో మహిళ ఆరోగ్య హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగినది ఈ క్యాంపు ను స్థానిక కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ ప్రారంభించారు

ఆర్పీ సభ్యులు మహిళా సంఘం సభ్యులు కలిసి

చాలామంది మహిళలకురక్త పరీక్షల ద్వారా షుగర్ థైరాయిడ్ ఐరన్ లోపం టెస్ట్ లు చేయించడం జరిగినది ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ

ప్రాథమిక దశలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి

రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు థైరాయిడ్ పరీక్షలు

క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం వలన

మన శరీరంలో రాబోయే వ్యాధులను గుర్తించగలిగి వాటికి సరియైన వైద్యం చేయించుకొని జీవితాలను కాపాడుకోవచ్చని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు 8 పరీక్షలు ఉచితంగా చేయాలని సంకల్పించి ప్రతి మంగళవారం మహిళలకు వైద్య పరీక్షలు చేస్తున్నారని అందుకే ఈరోజు కిసాన్ నగర్ లో కూడా వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు తెలియజేయగా

చాలా పెద్ద ఎత్తున మహిళలు రావడం జరిగింది అలాగే పురుషులు కూడా రక్త పరీక్షలు చేయించుకోవడం

చేశారు అనారోగ్యం అనేది కుటుంబాన్ని రోడ్డున పడేస్తుందని తీరని దుఃఖాన్ని కలిగిస్తుందని అందుకే ముందు జాగ్రత్తగా ప్రతి నెలకు ఒకసారి ఇలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు ఈ వైద్య శిబిరంలో

25 వ డివిజన్ కార్పొరేటర్ ఎడ్ల సరిత అశోక్ కూడా పాల్గొన్నారు అలాగే డాక్టర్ ఇమ్రాన్ ఎంబిబిఎస్ హెల్త్ సూపరింటెండెంట్ ఎం.కె బేగ్

ఏ ఎన్ ఎం ఆశ స్టాఫ్ నర్స్ షబానా, స్వామి పాల్గొని

ప్రజలకు పరీక్షలు చేశారు

 

Join WhatsApp

Join Now