రెండు మూడు రోజుల్లో అధిష్టానం అధికారంగా ప్రకటించే ఛాన్స్…
జోష్ లో పార్టీ కార్యకర్తలు..
తెలంగాణ రాష్ట్రంలో అధికారం మార్పిడి జరిగి కేసీఆర్ నుండి రేవంత్ రెడ్డికి అధికారం చేజిక్కాక రాజకీయ వలసలు పెరిగాయి.గద్వాలలో బిఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు.ఆయన ఎమ్మెల్యేతో పాటు గద్వాల బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు.బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికతో గద్వాల బిఆర్ఎస్ ను నడిపించేదెవరని గద్వాలలో జోరుగా చర్చ కొనసాగుతుంది.. గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి పార్టీ వీడినా ముఖ్యమైన నేతలు,ఉద్యమకారులు బిఆర్ఎస్ లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. అందులో బాసు హనుమంతు నాయుడు,నాగర్ దొడ్డి వెంకట్రాములు,మోనేష్,మారోజు లాంటి ఉద్యమ నాయకులు బిఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు.మాజీ షాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్,కురువ విజయ్ కుమార్ లాంటి ముఖ్య నేతలు పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా పని చేస్తున్నారు.తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ పిలుపులో భాగంగా తెలంగాణ సాధనే లక్ష్యంగా 2009లో కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన బాసు హనుమంతు నాయుడు ప్రస్తుతం గద్వాల బిఆర్ఎస్ కు కీలక నాయకుడిగా మారారు.దాదాపు దశాబ్దన్నర కాలంగా బిఆర్ఎస్ కు ఒక ధృడమైన నాయకునిగా తయారై ప్రజలకు అండగా నిలిచారు.ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన బలహీన వర్గాల నాయకుడు మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడి కుటుంబ సభ్యుడిగా బాసు హనుమంతు నాయుడు గద్వాల నియోజకవర్గంలో అందరికి సుపరిచితుడే….భీముడి రాజకీయ వారసత్వాన్ని అందుకోవటమే కాకుండా దాన్ని మరింత పెంచి పెద్ద చేసిన గొప్ప బహుజన బిడ్డ బాసు హనుమంతు నాయుడు.రెండు పర్యాయాలు తన భార్య బాసు శ్యామలని అత్యదిక మెజారిటీతో గట్టు మండల జడ్పిటిసిగా గెలిపించుకున్నారు. హనుమంతు నాయుడు గట్టు మండలం బల్గేర సర్పంచుగా కొనసాగారు.వీటన్నింటిని పార్టీ పెద్దలు ఆలోచించి బాసు హనుమంతు నాయుడుకు గద్వాల నియోజకవర్గ ఇంచార్జ్ ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది…రెండు మూడు రోజుల్లో పార్టీ అధిష్టానం అధికారంగా ప్రకటించనుంది…