బస్వాపురం ప్రాజెక్టు తక్షణమే పూర్తి చేసి సాగునీరు అందించాలి
నిర్వాసితులందరికీ వెంటనే డబ్బులు విడుదల చేయాలి
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ డిమాండ్
యాదాద్రి భువనగిరి ఆగస్టు 31 ప్రశ్న ఆయుధం :
యాదాద్రి భువనగిరి 10 మండలాల్లో 1.88 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించే బస్వాపురం రిజర్వాయర్ ను తక్షణమే పూర్తి చేయాలని, నిర్వాసితులందరికీ వెంటనే డబ్బులు విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. శనివారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలోని సిపిఎం భువనగిరి మండల కమిటీ సమావేశం మండల కార్యదర్శి వర్గ సభ్యురాలు కొండమడుగు నాగమణి అధ్యక్షతన జరగక సమావేశంలో ముఖ్యఅతిథిగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ, కరువు పీడిత ప్రాంతమైన యాదాద్రి భువనగిరి జిల్లాను సస్యశ్యామలం చేయడానికి గత పాలకులు 11.39 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న బస్వాపురం రిజర్వాయర్ ఏళ్లు గడుస్తున్నా ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజలందరికీ సాగునీరు అందించడానికి తమ భూములను, ఊర్లను, ఆస్తులను సర్వం కోల్పోతూ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఎందుకు పరిహారము చెల్లించి పునరవాసం కల్పించడం లేదని అన్నారు. ఒక తిమ్మాపురం గ్రామంలో 2230 ఎకరాల భూమికి 1760 ఎకరాల భూమి ముంపుకు గురవుతుంటే వారికి ఇవ్వవలసిన రూ. 162 కోట్ల రూపాయలు ఎందుకు రైతులకు చెల్లించడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు పరిమితం కాకుండా నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి, ప్రాజెక్టు నిర్మాణానికి సరిపడా బడ్జెట్ ను విడుదలచేసి, కాలువలను మొత్తం పూర్తిచేయాలని అన్నారు. మండలం నుండి కాలువ పోయే ప్రతి గ్రామంలో డిస్ట్రిబ్యూటర్ మరియు మైనర్ కాలువలను నిర్మించి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిర్మాణం కోసం, నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం రానున్న కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామని నర్సింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇంకా ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య , ఏదునూరి మల్లేశం, కొండా అశోక్, మండల కమిటీ సభ్యులు సిలివేరి ఎల్లయ్య , పాండాల మైసయ్య , మోటెఎల్లయ్య , అబ్దుల్లాపురం వెంకటేష్ , కొండాపురం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.