Site icon PRASHNA AYUDHAM

స్వప్నలోక్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

IMG 20241010 WA07361

స్వప్నలోక్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ప్రశ్నాయుధం న్యూస్, అక్టోబర్ 10, కామారెడ్డి :

కామారెడ్డి పట్టణంలోని స్వప్నలోక్ కాలనీలో గురువారం సద్దుల బతుకమ్మ పండుగ, దుర్గ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళలంతా ముస్తాబై ఒకే చోట చేరి బతుకమ్మ ఆట పాటలతో ఆనందంగా జరుపుకున్నారు.
ఆడపడుచులు అంతా కలిసి కన్నుల పండువగా అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకున్నారు. బతుకమ్మ ఉత్సవాలు పూలను పూజించే గొప్ప సంస్కృతికి నెలవని మహిళలు పేర్కొన్నారు. తీరొక్క పూలతో రూపొందించిన ఘనమైన బతుకమ్మలతో ఆడి పాడే సంబరంలో ఆఖరి రోజున బతుకమ్మను ‘సద్దుల బతుకమ్మ’గా ఘనంగా నిర్వహించారు. పెరుగన్నం, చిత్రాన్నం, పులిహోర, కొబ్బరిపొడి, నువ్వులపొడి ఇలా ఐదు రకాల సద్దులను అమ్మకు నైవేద్యంగా సమర్పించి, ఆట పూర్తయిన అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

Exit mobile version