Site icon PRASHNA AYUDHAM

అక్షర పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

IMG 20241001 WA0397

అక్షర పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

ప్రశ్న ఆయుధం, అక్టోబర్ 01, కామారెడ్డి :

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అక్షర ఉన్నత పాఠశాలలో మంగళవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు తెలుగు సంప్రదాయ దుస్తుల్లో తెలుగుదనం ఉట్టి పడేలా ముస్తాబై రంగు రంగుల బతుకమ్మలతో అక్షర ఉన్నత పాఠశాలలో సందడిగా బతుకమ్మ ఆటలాడారు. బొడ్డమ్మతో మొదలై ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఇలా దేనికదే ప్రత్యేకతగా సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో సంబరాలు ముగుస్తాయనీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీత రెడ్డి తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండగను పురస్కరించుకొని అక్షర ఉన్నత పాఠశాల కామారెడ్డి లో విద్యార్థినులు రంగు రంగు పూలతో బతుకమ్మను పేర్చి సంతోషంగా పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఒకరు పాడుతుంటే మిగతా వారంతా వంత పాడారు. ప్రధాన ఉపాధ్యాయురాలు సంగీతా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలిచేది బతుకమ్మ పండగ అని ఈతరం విద్యార్థినులైన వారికి సంస్కృతి, సంప్రదాయాలను గురించి వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అక్షర పాఠశాల చైర్మన్ అశోక్ రెడ్డీ , కరస్పాండెంట్ శ్రీ లోకేష్ రెడ్డి, అధ్యాపక బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.

Exit mobile version