Site icon PRASHNA AYUDHAM

మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

IMG 20241004 WA04721

మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

ప్రశ్న ఆయుధం న్యూస్, అక్టోబర్ 04, కామారెడ్డి :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడుతు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందు ప్రియ సందడి చేశారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి ఇంట్లో బతుకమ్మ సంబరాలు చేసుకుంటారన్నారు. బొడ్డెమ్మతో మొదలుకొని ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదేనన్నారు. తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా రంగు రంగుల పూలతో ప్రతి అడపడుచు ముందుండి సంబరాలు చేసుకుంటారన్నారు. బతుకమ్మను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version