ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు
ప్రశ్న ఆయుధం న్యూస్, అక్టోబర్ 01, కామారెడ్డి :
ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల కామారెడ్డిలో కళాశాల విద్యార్థినులు, మహిళ అధ్యాపకులచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని కళాశాల సాంస్కృతిక కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ అని, సంస్కృతి సంప్రదాయాలకు ఇతర రాష్ట్రాలకు తెలియజేస్తూ తొమ్మిది రోజులు పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారని, ఒకవైపు నవరాత్రుల ఉత్సవాలు మరోవైపు పూల పండుగ బతుకమ్మతో తెలంగాణ రాష్ట్రం ఈ తొమ్మిది రోజులు కళకళలాడుతూ ఉంటుందని, తొమ్మిది రోజులు పాటు 9 పేర్లతో బతుకమ్మను తయారు చేసి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి గౌరీ దేవిని పూజిస్తారని మహిళలందరూ ఒకచోట చేరి ఆనందంగా గడుపుతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కిష్టయ్య, అధ్యాపకులు డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ విశ్వప్రసాద్ డాక్టర్ జి. శ్రీనివాసరావు, లక్ష్మీనాచారి డాక్టర్ రాజ్ గంభీరావు, డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ మహిళా అధ్యాపకులు డాక్టర్ శారద,శ్రీలత, మానస, స్వాతి తదితరులు పాల్గొన్నారు.