ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ…

ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ..

IMG 20241010 WA0082

వనపర్తి పట్టణం అంబేద్కర్ చౌకులో భారత జాతీయ మహిళా సమాఖ్య (సిపిఐ అనుబంధఎన్ఎఫ్ఐ ఐడబ్ల్యూ) వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాత్రి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను సిపిఐ ఆఫీస్ నుంచి ప్రదర్శనగా తెచ్చి అంబేద్కర్ చౌక్ లో ఉంచి చుట్టు తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ బొడ్డెమ్మలు కొట్టారు. నృత్యాలు చేశారు. భారత జాతీయ మహిళా సమాఖ్య ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ, సిపిఐ పట్టణ కమిటీ కార్యదర్శి రమేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీరామ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు యత్తం మహేష్ మాట్లాడారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. అయితే బతుకమ్మను దేవతగా కొలిచే తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు మానభంగాలు జరగటం దారుణం అన్నారు. చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. భారతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి గీత, సెకండ్ ఏఎన్ఎంల జిల్లా అధ్యక్షులు కృష్ణవేణి, ఎన్ఎఫ్ ఐ డబ్ల్యు పట్టణ అధ్యక్షులు జయమ్మ, నాయకులు శిరీష, జయశ్రీ, సునీత, ప్రవళిక, వెంకటమ్మ, రాధ, స్పందన తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now