ప్రకృతిని,పూలను పూజించే పండగ బతుకమ్మ :నీలం మధు ముదిరాజ్.

ప్రకృతిని,పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్.

చిట్కుల్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు..

వేడుకలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన నీలం మధు సతీమణి నీలం కవిత…

IMG 20241010 WA0078

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. గురువారం చిట్కుల్ లో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రమంతా గ్రామ గ్రామాన అక్క చెల్లెలు సంబరంగా నిర్వహించుకునే పూల పండగ బతుకమ్మ అన్నారు. బతుకమ్మ పాటలతో ఆటలతో తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకునే సామాజిక సంబురం ఈ పండగ అని కొనియాడారు. పూలనే దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి, సాంప్రదాయం మన తెలంగాణకే దక్కిందన్నారు.

IMG 20241010 WA0080

తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుందనీ స్పష్టం చేశారు. మహిళలందరూ భక్తిశ్రద్ధలతో బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలని కోరారు. ఆ గౌరీ మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో పరిరవిల్లాలని ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో మహిళలు, ప్రజాప్రతినిధులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now