*సర్కారు బడులలో ఏఐవిద్యకు నేటి నుంచి శ్రీకారం మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్*
ప్రశ్న ఆయుధం మార్చి 15 : పాఠశాల విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది మరింత నాణ్యమైన ప్రమాణాలతో పాఠశాల విద్యను విద్యార్థులకు అందించడానికి ఏఐఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది కార్పొరేట్ స్థాయికి దీటుగా
అందులో భాగంగా ఈరోజు చిట్టాపూర్ ప్రాథమిక పాఠశాలలో, కిసాన్ నగర్ లోని కిషన్ నగర్ ప్రాథమిక పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ , కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రాజేంద్ర కుమార్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుబీర్ శ్రీనివాస్ ప్రారంభించారు విద్యార్థులలో మరింత మెరుగైన అభ్యసన పద్ధతులను సాంకేతిక ప్రమాణాల పెంపునకు ఏ ఐ క్లాసెస్ ఎంతో దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులలో వ్యక్తిగత స్థాయిలో విద్యా ప్రమాణాలను అభ్యస సామర్థ్యాలను ఈ విధానం ద్వారా మరింతగా మెరుగుపరచవచ్చునని, విద్యార్థులలో ఉన్న అభ్యసన లోపాలను గుర్తించి వాటిని సవరించడానికి చర్యలు చేపట్టవచ్చునని మండల విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలు తెలియజేశారు సాంకేతిక పరిజ్ఞానం సమర్థవంతంగా ఉపయోగించడానికి డిజిటల్ పద్ధతులపై పూర్తిస్థాయిలో ఇదివరకే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు ఈ పద్ధతి ద్వారా విద్యార్థులలో విద్యార్థులు ఏ అంశాలలోవెనుకబడి ఉన్నారో గుర్తించి విద్యార్థుల్లో చదవడం రాయడం లెక్కలు చేయడం వంటి సామర్ధ్యాలను పెంపొందించడానికి ఏఐ ఎంతగానో దోహదపడుతుందని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు వారి సామర్థ్యా లని మరింత మెరుగుపరిచే విధానంలో ఏఐ ఉపయోగపడుతుందని ఇంతకుముందు ప్రాథమిక విద్యార్థులకు కనీస అభ్యసన సామర్ధ్యాల పెంపునకు ఎఫ్ ఎల్ ఎన్ ప్రోగ్రాం ఇప్పుడు మరోసారి విద్యార్థుల్లో నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి ఇదంతా దువాదపడుతుందని మండల విద్యాశాఖ అధికారి .
సర్కారు బడులలో ఏఐవిద్యకు నేటి నుంచి శ్రీకారం మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్
Updated On: March 15, 2025 9:16 pm
