అంగరంగ వెభవంగా బతుకమ్మ సంబరాలు
నిజామాబాద్ జిల్లా ప్రశ్నాయుధం సెప్టెంబర్ 20
ఆర్మూర్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకొన్నామని పాఠశాల ప్రిన్సిపాల్ రజని కుమారి మేడమ్ గారు తెలిపారు. ఈ సంబరాల్లో భాగంగా విద్యార్థిని, విద్యార్థులు సాంప్రదాయమైన దుస్తులతో విచ్చేసారని . విద్యార్థులు ఉపాధ్యాయులందరూ కలిసి బతుకమ్మను తయారు చేస్తూ దాని ప్రత్యేకతను చర్చించుకున్నారని ఈ వేడుకలకు తెలంగాణా నారాయణ విద్యా సంస్థల G.M గోపాల్ రెడ్డి గారు, నిజామాబాద్ జోన్ Agm శివాజీ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు చక్కగా వివరించారని, నారాయణ పాఠశాలలు చదువుతో పాటు సాంప్రదాయాలకు కూడా విలువలను ఇచ్చే విధంగా బోధింపబడుతున్నాయని తెలిపారు. ఈ ఉత్సవాలలో పాఠశాల జోనాల్. కో-ఆర్డినేటర్స్ రాకేష్, కల్పన, అజీమా, VP’s. శైలజ, స్రవంతి . A.O నవీన్ మరియు పాఠశాల అధ్యాపక బృందం పాల్గోన్నారు.