Site icon PRASHNA AYUDHAM

తిమ్మాపూర్ స్థానిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

IMG202509201456312

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 20, (ప్రశ్న ఆయుధం):

మండలం లోని తిమ్మాపూర్ గ్రామ స్థానిక ఎం.పీ.పి.ఎస్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలను అధ్యాపకులు అనిల్, దివ్య, గోదావరి, ఆశా వర్కర్ మాధవి, ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ దివ్య, ఆయా నవీనల కృషి మరియు గ్రామస్థుల సహకారంతో విజయవంతంగా జరిపారు. చిన్నారులు సీజనల్ పూలతో అందమైన బతుకమ్మలను తయారు చేసి, సాంప్రదాయ పాటలు పాడుతూ ఆనందంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు కొండ దివ్య మాట్లాడుతూ-“పిల్లలకు చిన్న వయసులోనే సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడం చాలా ముఖ్యమని, బతుకమ్మ పండుగ దానికి మంచి వేదిక అవుతుంది” అని పేర్కొన్నారు.

మామిడి గోదావరి మాట్లాడుతూ, “బతుకమ్మను పూలతో తయారు చేయబడటం ప్రకృతి సౌందర్యానికే ప్రతీక. పిల్లల్లో పర్యావరణం పట్ల ప్రేమ పెంపొందించడమే ఈ వేడుకల లక్ష్యం” అన్నారు.

అదేవిధంగా ఆశా వర్కర్ చిమ్మ మాధవి మాట్లాడుతూ, “గ్రామం, పాఠశాల కలసి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే పిల్లల్లో సంస్కృతి పట్ల గౌరవం పెరుగుతుంది. భవిష్యత్ తరాలు విలువలను కాపాడుకుంటాయి” అని అన్నారు. అదే విధంగా గ్రామస్థులు, తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని పిల్లల ఉత్సాహాన్ని మరింత పెంచారు.

Exit mobile version