హరిత కాలనీలో బతుకమ్మ సంబరాలు సందడి

హరిత కాలనీలో బతుకమ్మ సంబరాలు సందడి

సంస్కార భారతి ఆధ్వర్యంలో పాటల పోటీలు – విజేతలకు బహుమతులు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 26 

 

కామారెడ్డి హరిత కాలనీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్కార భారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాటల పోటీలు నిర్వహించగా, 10 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

🏆 విజేతలకు బహుమతులు

ఈ పోటీల్లో జి. ఇందిర మొదటి బహుమతి, ఎల్. భాగ్య రెండో బహుమతి, ఎం. సంధ్య మరియు కే. ఉమా మూడో బహుమతులు పొందారు. అన్ని పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు కూడా అందజేశారు.

🌸 ప్రముఖుల హాజరు

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు కె. కృష్ణమూర్తి, కోశాధికారి సి హెచ్. వెంకట్ రాజం, మాజీ కౌన్సిలర్ కే. లక్ష్మణ్, జి. శ్రీరాములు, ఎల్. అశోక్, ఎన్. శ్రీనివాస్ రెడ్డి, కే. బాలరాజ్, పి. సాయిరెడ్డి తదితరులు పాల్గొని బతుకమ్మ సంబరాలను అలంకరించారు.

Join WhatsApp

Join Now