నిషిత కాలేజ్‌ లో బతుకమ్మ సంబురాలు

నిజామాబాద్ సెప్టెంబర్‌ 25 (ప్రశ్న ఆయుధం)
నిషిత డిగ్రీ & పీజీ కాలేజ్‌లో బతుకమ్మ పండుగను ఆంధ్ర వైభవంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు రంగురంగుల బతుకమ్మలను పేర్చి, సాంప్రదాయ బతుకమ్మ పాటలతో ఉల్లాసంగా ఆడిపాడారు. పూల పరిమళాలతో కళకళలాడిన ప్రాంగణం సంబుర వాతావరణాన్ని తలపించింది.

కార్యక్రమానికి రాజు (అకాడమిక్ కోఆర్డినేటర్), వినయ్ (చీఫ్ కాటన్), డాక్టర్ కె. సాయిలు (అకాడమిక్ అడ్వైజర్), డాక్టర్ షేక్ (డైరెక్టర్), డాక్టర్ కె. స్వప్న (ప్రిన్సిపాల్) హాజరై విద్యార్థినులను ఉత్సాహపరిచారు.

విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకురాళ్లు, కాలేజ్ యాజమాన్యం బతుకమ్మ వేడుకల్లో చురుగ్గా పాల్గొనడం విశేషం.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, “సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ, భవిష్యత్తు తరాలకు వాటి విలువలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వేడుకను ఘనంగా నిర్వహించాం” అని తెలిపారు.

Join WhatsApp

Join Now