సరంపల్లిలో సంస్కార భారతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా

సరంపల్లిలో సంస్కార భారతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా

సాంప్రదాయాలు కాపాడుతున్న మహిళలు మన జాతి సంపద – డా. సమ్మిరెడ్డి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 27

 

సంస్కార భారతి కామారెడ్డి శాఖ మాతృ శక్తి విభాగం ఆధ్వర్యంలో సరంపల్లి గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ పాత సాంప్రదాయాలను స్మరించుకొని ఆనందించారు. పాటల పోటీలలో ఉత్సాహంగా పాల్గొని విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. జిల్లా అధ్యక్షుడు డా. జి. సమ్మిరెడ్డి మహిళలను అభినందించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పాతూరి సత్య ప్రసాద్, మాతృ శక్తి కన్వీనర్ నాగపురి ప్రసన్న, ఇతర కార్యకర్తలు, మాజీ కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్, VDC అధ్యక్షులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now