కలెక్టరేట్‌లో ఉత్సాహంగా బతుకమ్మ

కలెక్టరేట్‌లో ఉత్సాహంగా బతుకమ్మ

మహిళలతో కలసి బతుకమ్మ ఆడిన కలెక్టర్, ఎస్పీ

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 25

 

బతుకమ్మ పండుగ అనేది మహిళా సోదరీమణులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.

ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి వారిలో ఆనందం నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేక అనుభూతి కలిగించేదని, అన్ని పండుగల్లో బతుకమ్మకే అత్యంత ప్రాధాన్యం ఉందని తెలిపారు.

జిల్లాలో ప్రభుత్వ సూచనల మేరకు ప్రతిరోజు కలెక్టరేట్‌తో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఆనందంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారని ఆయన వివరించారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సిబ్బంది, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, టీఎన్జీవో అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now