మల్లాయపల్లి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 20, (ప్రశ్న ఆయుధం):

యం.పి.పి.ఎస్ మల్లయిపల్లిలో సాంప్రదాయిక బతుకమ్మ ఉత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయుడు విశ్వనాథ్ మరియు సిబ్బంది నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు స్థానికులు చురుకుగా పాల్గొన్నారు.

కార్యక్రమంలో బతుకమ్మ తయారీ మరియు దాని ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం, బతుకమ్మ పాటలకు డాన్స్ ప్రదర్శనలు, సాంప్రదాయిక పద్ధతిలో ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది.

విద్యార్థులు తమ కళారూపాలను ప్రదర్శిస్తూ సంప్రదాయానికి గౌరవం తెలియజేశారు. ఉపాధ్యాయులు బతుకమ్మ పండుగ చరిత్ర, ఆచారాల ప్రాముఖ్యతను వివరించారు.

కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సాంప్రదాయాల పట్ల ఆసక్తి పెరగడం, భవిష్యత్తులో వీటిని కొనసాగించేందుకు ప్రేరణ కలిగించడం లక్ష్యంగా ఉంది.

Join WhatsApp

Join Now