ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 23, (ప్రశ్న ఆయుధం):
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో “బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలెంజ్–2025” నిర్వహించనున్నట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. యువతలో ప్రతిభ, సృజనాత్మకతకు వేదికగా ఈ పోటీలు నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. కావున యువత పెద్ద ఎత్తున పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు.
◆ బహుమతులు:
▸ ప్రథమ బహుమతి – రూ.3 లక్షలు
▸ ద్వితీయ బహుమతి – రూ.2 లక్షలు
▸ తృతీయ బహుమతి – రూ.1 లక్ష
▸ స్పెషల్ మెన్షన్ – రూ.20 వేల చొప్పున (5 మందికి)
◆ అర్హతలు:
▸ 40 ఏళ్ల లోపు యువత, కళాశాల విద్యార్థులు అర్హులు
▸ అంశాలు: ఉచిత బస్సు, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇళ్ళు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ తదితర పథకాలు
▸ షార్ట్ ఫిల్మ్ – 3 నిమిషాలు
▸ పాట – 5 నిమిషాలు
▸ 4K క్వాలిటీ తప్పనిసరి
◆ జడ్జింగ్ ప్రమాణాలు:
▸ క్రియేటివిటీ
▸ టెక్నికల్ ఎక్సలెన్స్
▸ థీమ్ అనుగుణత
▸ ఎంటర్టైన్మెంట్ వాల్యూ
◆ తుది గడువు: అక్టోబర్ 30, 2025
◆ సమర్పణకు:
📧 youngfilmmakerschallenge@gmail.com
📱 WhatsApp Only: 81258 34009
విజేతలకు బహుమతులు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) ద్వారా అందజేయబడతాయని నిర్వాహకులు తెలిపారు.